Header Ads

1/randomposts

Anushka Shetty’s Nishabdham Movie on Amazon Prime Video on October 2

Anushka Shetty’s Nishabdham Movie on Amazon Prime Video on October 2 

Anushka Shetty’s Nishabdham Movie on Amazon Prime on October 2


Nishabdham, starring Anushka Shetty and R Madhavan in the lead, and also co-stars Anjali, Shalini Pandey, Subbaraju and Srinivas Avasarala. Hollywood actor Michael Madsen of Reservoir Dogs fame has also played a key role in the film.

This Movie Trailer will out Sept 21, 1pm & Movie will release on October 2 on Amazon Prime Video. The film has been directed by Hemant Madhukar.
The first look poster of Anushka Shetty’s character from Nishabdam was unveiled last September. The poster introduces Anushka as Sakshi, a mute artist who expresses through her art. In the poster, Anushka is seen gazing at something and painting it on the drawing board in front of her.

Anushka plays a deaf and mute character while Madhavan plays her husband in the film which revolves around the murder of a key character and the subsequent investigation to find the killer. The entire film has been shot in Seattle, USA.

Originally shot in Tamil and Telugu, Nishabdam will also release Hindi, Malayalam and Kannada. The film has been titled Silence in English and Hindi.


                                       అనుష్క చిత్రం కూడా ఓటీటీలోనే..!



‘భాగమతి’ లాంటి హిట్‌ తర్వాత అనుష్క నుంచి రాబోతున్న మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘నిశ్శబ్దం’.ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటంతో దర్శక, నిర్మాతలు ఓటీటీలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కించిన చిత్రమిది. కోన వెంకట్‌, టిజి విశ్వప్రసాద్‌ నిర్మించారు. మాధవన్‌, మైఖేల్‌ మాడ్సన్‌, అంజలి, షాలినీ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. అనుష్క మాట్లాడుతూ ‘‘నేనిందులో మూగ, చెవిటి లక్షణాలున్న సాక్షి అనే చిత్రకారిణిగా కనిపిస్తా. ఇప్పటి వరకు పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది’’ అన్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైలెన్స్‌’ పేరుతో విడుదల కానుంది. దీనికి అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘ఎదురు చూస్తున్నాం’ అని ఉత్సాహంగా కామెంట్లు చేశారు.

anushka-shetty-nishabdam

ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియన్‌ కంటెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘ఇటీవల విడుదలైన మా డైరెక్ట్-టు-డిజిటల్ చిత్రాలు విజయవంతంగా రాణిస్తున్నాయి. మంచి కథతో తీసిన చిత్రానికి భాషతో పనిలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అనుష్క తొలి డిజిటల్‌ సినిమా. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ‘బ్రీత్’ సీజన్-1 తర్వాత మాధవన్‌ తిరిగి ఇందులో కనిపించబోతున్నారు. అపారమైన ప్రజాదరణ పొందిన అనుష్క, మాధవన్‌ దాదాపు 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఒకే తెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది’ అని అన్నారు.

anushka-shetty-nishabdam-sakshi

2020 ఆరంభంలోనే ‘నిశ్శబ్దం’ థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఆపై లాక్‌డౌన్‌ కారణంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలిగా నటించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు.

No comments:

Powered by Blogger.