Anushka Shetty as a Chief Guest for 'She Pahi's 1st Annual Conference 2021
Anushka Shetty as a Chief Guest For 'She Pahi's 1st Annual Conference 2021
"She Pahi" First Annual Conference 2021 conducting On (27.01.2021) at JRC Conventions.
Guest of Smt. Swati Lakra, IPS., (W&CSW) along with Shri. VC Sajjanar, IPS.,
DCP Smt. Anasuya will be holding an interaction with all women employees. Actress Anushka Shetty as a Chief Guest.
సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పహి’ ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఫీ పహి కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళా సిబ్బందిలో స్పూర్తి నింపుతున్నామన్నారు. సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలు ఉన్నారని, మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వుమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ట్రాఫిక్‌లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
సైబరాబాద్ లో డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలు మరియు ఫ్రీ షీ షటిల్ బస్ లను అనుష్కతో పాటుగా, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ సీపీ సజ్జానార్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ.. "ఇక్కడ ఉన్న ప్రతి మహిళ పోలీస్ సిబ్బంది ఒక స్టార్" అన్నారు. కోవిడ్ టైం లో పోలీస్ లు చాలా బాగా పని చేశారు. నన్ను ఇలాంటి కార్యక్రమ కు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంది మహిళా పోలీస్ లు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'షీ పాహి' అనే పేరు పెట్టడం చాలా బాగుంది. సమాజం లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని’అనుష్క తెలిపారు.
అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.
Anushka Shetty With Swati Lakra Madam
Anushka Shetty With Swati Lakra Madam & Sajjanar Sir
Anushka Shetty Entry At She Pahi's Conference
No comments: